రిలయన్స్‌ కేపిటల్‌కు క్యూ3 జోష్‌

రిలయన్స్‌ కేపిటల్‌కు క్యూ3 జోష్‌

ఈ ఏడాది మూడో క్వార్టర్‌లో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో అడాగ్ సంస్థ రిలయన్స్‌ కేపిటల్‌ కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది.  ప్రస్తుతం ఎన్‌న్‌ఎస్‌ఈలో ఈ షేరు దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 487 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 497 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.
ఫలితాలు గుడ్‌
స్టాండెలోన్‌ ప్రాతిపదికన క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో రిలయన్స్ కేపిటల్‌ నికర లాభం 8 రెట్లు ఎగసి రూ. 213 కోట్లకు చేరింది. ఇక మొత్తం ఆదాయం 150 శాతం పుంజుకుని రూ. 916 కోట్లను అధిగమించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన  సైతం నికర లాభం 50 శాతం జంప్‌చేసి రూ. 315 కోట్లను తాకింది. 



Most Popular