గలాక్సీ సర్ఫక్టేంట్స్‌ లిస్టింగ్‌ భేష్‌

గలాక్సీ సర్ఫక్టేంట్స్‌ లిస్టింగ్‌ భేష్‌

సర్ఫక్టేంట్స్‌సహా ఇతర స్పెషాలిటీ కెమికల్స్‌ తయారు చేసే గలాక్సీ సర్ఫక్టేంట్స్‌ లిమిటెడ్‌ లాభాలతో లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ. 1480కాగా..  రూ. 40 ప్రీమియంతో రూ. 1520  వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమైంది. బీఎస్ఈలో తదుపరి రూ. 1673 వద్ద గరిష్టాన్నీ.. రూ. 1520 వద్ద కనిష్టాన్నీ తాకింది. ప్రస్తుతం రూ. 12 శాతంపైగా లాభంతో రూ. 1662 వద్ద ట్రేడవుతోంది. ఇటీవలే పబ్లిక్‌ ఇష్యూ పూర్తిచేసుకున్న కంపెనీ 44.32 లక్షల షేర్లను విక్రయించడం ద్వారా రూ. 937 కోట్లు సమీకరించింది.   
కంపెనీ వివరాలివీ
వ్యక్తిగత సంరక్షణ, గృహ పరిరక్షణ వంటి విభాగాలలో వినియోగించే స్పెషాలిటీ కెమికల్స్‌ను గలాక్సీ సర్ఫక్టేంట్స్‌ తయరు చేస్తోంది. అంటే స్కిన్‌ కేర్‌, ఓరల్‌ కేర్‌, హెయిర్‌ కేర్‌, కాస్మెటిక్స్‌, టాయిలెటరీస్‌, డిటర్జెంట్స్‌ తదితర ఉత్పత్తులకు అవసరమైన కెమికల్స్‌ సరఫరా చేస్తోంది. దేశీయంగా అగ్రగణ్య సర్ఫక్టేంట్స్‌ తయారీ సంస్థలలో ఒకటైన కంపెనీ కస్టమర్లలో పలు దేశ, విదేశీ ఎఫ్‌ఎంసీజీ దిగ్గజాలున్నాయి. కెవిన్‌కేర్‌, కాల్గేట్‌ పామోలివ్‌, హిమాలయ, ఎల్‌ఓరియల్‌, పీఅండ్‌జీ డాబర్‌, హెంకెల్‌ తదితరాలకు ప్రొడక్టులను అందిస్తోంది. కంపెనీ అమ్మకాలలో పెర్ఫార్మెన్స్‌ సర్ఫక్టెంట్స్‌ వాటా 65 శాతంకాగా.. స్పెషాలిటీ కేర్‌ ప్రొడక్టుల వాటా 35 శాతంగా ఉంటోంది. అమెరికా, ఆసియాలోని పలుదేశాలకు ప్రొడక్టులను ఎగుమతి చేస్తోంది.



Most Popular