ఫ్యూచర్‌ సప్లై చైన్‌ లిస్టింగ్‌ ఓకే!

ఫ్యూచర్‌ సప్లై చైన్‌ లిస్టింగ్‌ ఓకే!

ఇటీవలే పబ్లిక్‌ ఇష్యూ పూర్తి చేసుకున్న లాజిస్టిక్స్‌ రంగ సంస్థ ఫ్యూచర్‌ సప్లై చైన్‌ సొల్యూషన్స్‌ స్టాక్‌ ఎక్స్చేంజీలలో ఇష్యూ ధర వద్దే లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ. 664 కాగా.. ఎన్‌ఎస్‌ఈలో ఇదే ధర వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమైంది. ప్రస్తుతం 2.2 శాతం లాభపడి రూ. 679 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 696 వద్ద గరిష్టాన్నీ, రూ. 660 వద్ద కనిష్టాన్నీ తాకింది.
7 రెట్లు స్పందన
ఈ నెల8న ముగిసిన ఇష్యూకి 7.4 రెట్లు అధికంగా స్పందన లభించింది. తద్వారా కంపెనీ రూ. 650 కోట్లను సమీకరించింది. ఈ ఐపీవో ద్వారా బిగ్‌ బజార్‌ స్టోర్ల కిశోర్‌ బియానీ గ్రూప్‌ నుంచి మరో సంస్థ స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యింది. ఐపీవో నిధుల్లో రూ. 150 కోట్లు మాతృ సంస్థ ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌కు లభించనుండగా.. మరో రూ. 350 కోట్లు కంపెనీలో మొదట్లో ఇన్వెస్ట్‌చేసిన గ్రిఫిన్‌ పార్టనర్స్‌కు దక్కనున్నాయి.



Most Popular