షాల్బీ హాస్సిటల్‌ ఐపీవోకు స్పందన ఓకే

షాల్బీ హాస్సిటల్‌ ఐపీవోకు స్పందన ఓకే

అహ్మదాబాద్‌ కేంద్రంగా 1994 నుంచీ ఆసుపత్రులను నిర్వహిస్తున్న షాల్బీ హాస్సిటల్‌ పబ్లిక్‌ ఇష్యూ మూడు  రెట్లు అధికంగా సబ్‌స్క్రయిబ్‌ అయ్యింది. ఈ నెల 5న మొదలైన ఇష్యూ 7న(గురువారం) ముగిసింది. రూ. 245-248 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ దాదాపు రూ. 505 కోట్లను సమీకరించింది. ఇష్యూలో భాగంగా 4న యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ. 150 కోట్లను సమీకరించిన సంగతి తెలిసిందే. యాంకర్‌ ఇన్వెస్టర్లలో గోల్డ్‌మన్‌ శాక్స్‌, సిటీగ్రూప్‌, యాక్సిస్‌ ఎంఎఫ్‌ తదితర సంస్థలున్నాయి. 
స్పందన ఇలా
షాల్బీ హాస్సిటల్‌ ఇష్యూకి సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి 4.5 రెట్లు అధికంగా బిడ్స్‌ దాఖలుకాగా..  రిటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి దాదాపు మూడు రెట్లు అధికంగా దరఖాస్తులు లభించాయి. కనీసం 60 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇంతకంటే అధికంగా షేర్లు కావాలనుకుంటే రూ. 2 లక్షల మొత్తానికి మించకుండా ఒకే లాట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఐపీవో నిధులను రుణాల చెల్లింపు, సాధారణ కార్పొరేట్‌ కార్యకలాపాలకు వెచ్చించనున్నట్లు షాల్బీ ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. సంస్థకు రూ. 320 కోట్లమేర రుణభారముంది.



Most Popular