Bangalore conference

శామ్‌సంగ్ గెలాక్సీ జే సీరిస్ నుంచి మరో రెండు కొత్త ఫోన్లు

2016-07-14 16:25:30


  శామ్‌సంగ్ గెలాక్సీ జే సీరిస్ నుంచి మరో రెండు కొత్త ఫోన్లు

   శామ్‌సంగ్ కంపెనీ గెలాక్సీ జే సిరీస్‌లో రెండు కొత్త ఫోన్లు-గెలాక్సీ జే2 2016, గెలాక్సీ జే మ్యాక్స్‌లను మార్కెట్లోకి తెచ్చింది.  ప్రస్తుతం భారత్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్‌ఫోన్ ఈ గెలాక్సీ జే2యేనని శామ్ సంగ్ ఇండియా మొబైల్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ మను శర్మ తెలిపారు. పూర్తి స్థాయిలో వినోదం కావాలనుకునే వారి కోసం  గెలాక్సీ జే మ్యాక్స్‌ను అందిస్తున్నామని, గెలాక్సీ జే మ్యాక్స్‌లో 7 అంగుళాల డబ్ల్యూఎక్స్‌జీఏ డిస్‌ప్లే, వేగంగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి, స్ట్రీమింగ్ కోసం 4జీ వీఓఎల్‌టీఈ కనెక్టివిటీ వంటి ఫీచర్లున్నాయని ఆయన వివరించారు.  గెలాక్సీ జే2 2016ను ధర రూ.9,750 కాగా , గేలక్సీ జే మ్యాక్స్  ధర రూ.13,400 లుగా నిర్ణయించినట్లు శామ్‌సంగ్ తెలిపింది.
   
    
  శామ్‌సంగ్  గెలాక్సీ జే2 2016 ఫీచర్లు..

  - టర్బో స్పీడ్ టెక్నాలజీ
  - స్మార్ట్ గ్లో
  - ఆల్ట్రా డేటా సేవింగ్
  - ఎస్ బైక్ మోడ్,
  -5 అంగుళాల సూపర్ అమెలెడ్ డిస్‌ప్లే
   -1.5 గిగా హెర్ట్స్ క్వాడ్-కోర్ ప్రాసెసర్
  -1.5 జీబీ  ర్యామ్,
   -8 జీబీ ఇన్‌బిల్డ్ స్టోరేజ్,
   -32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమొరీ, 
  -డ్యుయల్ సిమ్, 
  -ఎల్‌ఈడీ ఫ్లాష్‌
  -8 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
  - 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
  - 2600 ఎంఏహెచ్ బ్యాటరీ
  - డౌన్‌లోడ్ స్పీడ్ 150 ఎంబీపీఎస్
  - అప్‌లోడ్ స్పీడ్ 50 ఎంబీపీఎస్
   bglre footer