మాస్‌కు తొలి రోజు మమమాస్‌... లాభం!

మాస్‌కు తొలి రోజు మమమాస్‌... లాభం!

వారం రోజుల క్రితం అత్యంత విజయవంతంగా పబ్లిక్‌ ఇష్యూ పూర్తిచేసుకున్న ఎంఏఎస్‌ ఫైనాన్షియల్‌ బుధవారం స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ.  459కాగా.. బీఎస్ఈలో 44 శాతం ప్రీమియంతో రూ. 660 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమైంది. ఇది రూ. 200 లాభంకాగా.. ట్రేడింగ్‌ ముగిసేసరికి  42 శాతం వృద్ధితో రూ. 655 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో రూ. 668 వద్ద గరిష్టాన్నీ... రూ. 625 వద్ద కనిష్టాన్నీ తాకింది.
ఓవర్‌ సబ్‌స్క్రిప్షన్‌..
ఇష్యూకి  ఇన్వెస్టర్లు క్యూకట్టడంతో ఏకంగా 128 రెట్లు అధికంగా సబ్‌స్ర్కయిబ్‌ అయ్యింది. ఇష్యూకి రిటైల్‌ ఇన్వెస్టర్లు సైతం 15 రెట్లకుపైగా దరఖాస్తు చేయడం విశేషం! ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 460 కోట్లను సమకూర్చుకుంది. ఇష్యూలో భాగంగా కంపెనీ యాంకర్‌ ఇన్వస్టర్ల నుంచి సైతం రూ. 136 కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే.
కంపెనీ పనితీరు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్‌(ఏప్రిల్‌-జూన్‌)లో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఎంఏఎస్‌ ఫైనాన్షియల్‌ రూ. 104 కోట్ల ఆదాయం సాధించింది. దాదాపు రూ. 24 కోట్ల నికర లాభం ఆర్జించింది. గుజరాత్‌ కేంద్రంగా ఏర్పాటైన కంపెనీ దేశవ్యాప్తంగా నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కార్యకాలాపాలను విస్తరించింది. ప్రధానంగా సూక్ష్మ, మధ్యతరహా సంస్థలతోపాటు మధ్య, తక్కువ ఆదాయ వర్గాలకు రుణాలను అందించడంపై దృష్టి కేంద్రీకరించింది.



Most Popular