అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఫలితాలు వీక్‌

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఫలితాలు వీక్‌

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో నికర లాభం 56 శాతం పడిపోయి రూ. 159 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం దాదాపు 2 శాతం క్షీణించి రూ. 8778 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం(ఇబిటా) మాత్రం 15 శాతం పెరిగి రూ. 634 కోట్లయ్యింది. ఇబిటా మార్జిన్లు 6.2 శాతం నుంచి 7.2 శాతానికి బలపడ్డాయి. 
శుక్రవారం బీఎస్ఈలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు 2.2 శాతం నష్టంతో రూ. 114 సమీపంలో ముగిసింది. ఇంట్రాడేలో రూ. 116 వద్ద గరిష్టాన్నీ, రూ. 107 వద్ద కనిష్టాన్నీ తాకింది.



Most Popular